ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా ‘కల్కి 2898 ఏడి’. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ఒక నేనే..నాకు చుట్టూ నేనే.. అంటూ సాగే ‘భైరవ అంథమ్’ని మేకర్స్ సోమవారం రిలీజ్ చేశారు. ప్రేక్షకులు, ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ పాటలో ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్ ఆదరగొట్టారు. దేశంలోని బిగ్గెస్ట్ స్టార్స్‌ని ఒక్కచోటికి చేర్చిన సినిమా ఇది. కామిక్-కాన్ శాన్ డియాగోలో తనదైన ముద్ర వేసిన మొదటి భారతీయ చిత్రంగా చరిత్ర సష్టించింది. యానిమేటెడ్ ప్రిల్యూడ్ ప్రజెంట్ చేసిన మొట్టమొదటి ఇండియన్ మూవీ ఇది. 4-టన్నుల ఫ్యూచరిస్టిక్ వెహికిల్ ‘బుజ్జి’ ప్రస్తుతం ఇండియాలో టూర్ చేస్తోంది. నార్త్, సౌత్ ఇండియా కల్చర్ రిచ్ నెస్‌ని ఒక అంథమ్‌తో బ్లెండ్ చేయడం ద్వారా ఈ సినిమాపై మేకర్స్ మరింతగా అంచనాలు పెంచారు. మ్యూజిక్ వీడియో కాశీ డార్క్, ఫ్యూచరిస్టిక్ వరల్డ్‌లో సెట్ చేయబడిన ఒక విజువల్ మార్వల్. దిల్జిత్ దోసాంజ్, విజయ నారాయణ్ పాడిన ఈ పాటకు కుమార్ లిరిక్స్ అందించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ పాటకు పోనీ వర్మ రియోగ్రాఫ్ చేశారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి హేమాహేమీలతో ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ వీస్ త్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ చిత్రం ఈనెల 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.