
నవతెలంగాణ – నెల్లికుదురు
వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకే కేటాయించాలని వరంగల్ ఉమ్మడి ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ నీ కోరినట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు హైదరాబాదులో ఉమ్మడి వరంగల్ ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ నీ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు శనివారం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో గత కొన్ని ఏళ్ల నుండి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నానని అన్నారు పార్టీలో ఎన్నో పదవులు తీసుకుని ప్రతి ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నానని అన్నారు కావున నాకు వరంగల్ ఎంపీ అభ్యర్థి స్థానం కల్పించాలని తన బయోడేటా అందజేస్తున్నట్లు తెలిపారు నాకు అ టికెట్ వచ్చేందుకు మీయొక్క సహాయ సహకారాలు అందించాలని కోరినట్లు తెలిపారు వారితోపాటు కాంగ్రెస్ నాయకులు సట్ల యాకయ్య రత్నపురం యాకయ్య తదితరులు ఉన్నారు.