బీఆర్ఎస్ లో వలసల పరంపర..

– కండువాలు కప్పి ఆహ్వానిస్తున్న పుట్ట
నవతెలంగాణ- మల్హర్ రావు
మండలంలో బీఆర్ఎస్ లోకి వలసల పరంపర కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో శుక్రవారం మండలంలోని మల్లారం, చిన్నతూoడ్ల, పెద్దతూoడ్ల గ్రామాల నుంచి దాదాపు వందమంది బీఆర్ఎస్ తిర్టం పుచ్చుకున్నారు. వారికి బీఆర్ఎస్ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మదుకర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ లో చేరినవారిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఓరుగంటి మొగిలి, బీజేపీ సీనియర్ నాయకుడు ఆవిర్నేని అచిత్ రావు, గంప రాజయ్య, పెద్దతుండ్ల యువకులు ఉన్నారు. సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృధ్ది, సంక్షేమ పథకాల అమలుతో పాటు, నియోజకవర్గంలో జెడ్పీ చైర్మన్‌ ఫుట్ట మధూకర్‌ చేస్తున్న సేవలకు ఆకర్షితులై ఆయనకు అండగా నిలువాలని బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు వారు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాఘవ రెడ్డి, రైతు సమితి అధ్య5 గొనె శ్రీనివాసరావు, యూత్ అధ్యక్షుడు జాగరి హరీష్, సర్పంచ్ పులిగంటి మమత నర్సయ్య, నాయకులు చెప్యాల రామారావు, దిలిప్ రావు, పులిగంటి రాములు పాల్గొన్నారు.