సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలి: గంగారపు స్రవంతి

నవతెలంగాణ పెద్దవంగర: సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ప్రత్యేక అధికారి గంగారపు స్రవంతి, టీపీటీఎఫ్ జిల్లా నాయకులు సోమారపు ఐలయ్య అన్నారు. మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీపీటీఎఫ్ మండల అధ్యక్షుడు, రామచంద్రు తండా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చిక్కాల సతీష్ తన స్వంత ఖర్చులతో కేజీబీవీ పాఠశాలకు రూ. 7 వేలు విలువచేసే ఫర్నీచర్ బహుకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి  దాతలు అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు.  అనంతరం పాఠశాల ఉపాధ్యాయ బృందం ప్రధానోపాధ్యాయుడు సతీష్ ను అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు గుర్రం శేఖర్, కోట వెంకటేశ్వర్లు, కేజీబీవీ ఉపాధ్యాయునీలు కళ్యాణి, సంధ్య, శైలజ, మమత, శ్రీలత, సరిత, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.