కాంగ్రెస్‌కు షాక్‌

– 200 మందితో బీఆర్‌ఎస్‌లో చేరిన ముగ్గురు ఎంపీటీసీలు
– పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి
నవతెలంగాణ-మెదక్‌
మెదక్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. సుమారు 200 మంది కార్యకర్తలతో ముగ్గురు కాంగ్రెస్‌ ఎంపీటీసీలు బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం మెదక్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపడుతున్న అభివద్ధి సంక్షేమ పథకాలతో పాటు నియోజకవర్గ అభివ ద్ధిని చూసి బీఆర్‌ఎస్‌లో పెద్ద ఎత్తున చేరుతున్నట్లు తెలిపారు. చిన్నశంకరం పేట మండల పరిధిలోని మిర్జాపల్లి ఎంపీటీసీ సభ్యురాలు సక్కుబాయి మున్యా నాయక్‌, ధర్పల్లి ఎంపీటీసీ సభ్యురాలు రాధమ్మ ఆంజనేయులు, షేర్‌ పల్లి ఎంపీటీసీ సభ్యురాలు సంతోష గొండ స్వామితో పాటు 200 మంది కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజలకు సమ ప్రాధాన్యతనిస్తూ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు చెప్పారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల నియోజవర్గం అభివద్ధి చెందలేదన్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గం దశల వారీగా అభివద్ధి చెందుతుందన్నారు. పట్టణాల్లో, గ్రామాల్లో అంతర్గత, ప్రధాన రహదారులు ఎంతో అభివద్ధి చెందాయని పేర్కొన్నారు. నియోజవర్గ అభివద్ధిని ఆకాంక్షించి పార్టీలో చేరడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నశంకరంపేట మండల పార్టీ అధ్యక్షులు రాజు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.