
తరలిన గులాబీ దళం వినిపించిన గెలుపుగలం గులాబీ శ్రేణులు శుక్రవారం అడవి ముద్దుబిడ్డ నాగజ్యోతి నామినేషన్ పర్వానికి భారీగా తరలి వెళ్లారు. ముందుగా ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి, సమన్వయ కమిటీ ప్రతినిధి బూర సురేందర్ లు పద్ధతి ప్రకారంగా లాంచనంగా జెండా ఊపి వాహన శ్రేణులను తరలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి సురేందర్ లు మాట్లాడుతూ బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పోరాడుతున్నామని అన్నారు. నాగజ్యోతి గెలిపే మా టార్గెట్ అని దానికోసం శక్తి వంచన లేకుండా పోరాటం కొనసాగిస్తామని అన్నారు. ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేస్తున్నారని దాని ఫలితమే ఇవాళ గులాబి శ్రేణులు భారీ సంఖ్యలో నామినేషన్ పర్వానికి ములుగు తరలి వెళ్లడం జరిగిందని అన్నారు. ప్రజలను కార్యకర్తలను భారీగా తరలించిన నాయకులకు కార్యకర్తలకు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.