
– ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సమూల మార్పులు
నవతెలంగాణ – హైదరాబాద్: వ్యవసాయంలో నిశ్శబ్ద విప్లవం చోటు చేసుకుంది. సంప్రదాయ వ్యవసాయంలోని సంక్లిష్టతలకు ఇది స్వస్తి పలికేలా చేసింది. ఆధునిక వ్యవసాయ పద్ధతుల వైపు వెళ్లేలా చేసింది. దీంతో రైతులు అధిక దిగుబడులు సాధించారు. అధిక లాభాలను చవిచూశార. ఇదంతా ‘రాశి మిత్ర’ సహకారంతో సాధ్యమైంది. ఇప్పుడు రాశి మిత్రతో అడుగులు వేసేందుకు రైతులు ముందుకు వస్తున్నారు. రాశి మిత్ర అర్ధ శతాబ్దపు వారసత్వం, విశిష్ట భారతీయ వ్యవసాయ సంస్థ రాశి సీడ్స్ చొరవ.. అధిక నాణ్యత గల హైబ్రిడ్ విత్తనాలను ఉత్పత్తి చేయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. రాశి మిత్ర రైతులతో విజ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. వ్యక్తిగత మార్గదర్శకత్వం ద్వారా పంట దిగుబడి, లాభదాయకతను పెంచడానికి రైతులకు నిపుణుల సలహాలు, అధునాతన వ్యవసాయ పద్ధతులు అందేలా రాశి మిత్ర సహకరిస్తుంది. రాశి మిత్ర సమిష్టి ప్రయత్నాలు సమాజాన్ని సుసంపన్నం చేయడానికి ఎంతగానో తోడ్పడ్డాయి. రాశి మిత్ర ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో దేశవ్యాప్తంగా పది వేల మంది రైతులు రాశి మిత్రలో నమోదు చేసుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో సానుకూల మార్పులకు ఈ కార్యక్రమం నిదర్శనంగా నిలుస్తుంది. రైతు అశోక్ పదేళ్ల అంకితభావం, ఆచరణాత్మక జ్ఞానంతో అద్భుతమైన విజయాన్ని సాధించారు. స్థానికంగా లెజెండ్‌గా ఎదిగారు. ఇటువంటి ఎన్నో విజయగాధలు ఉన్నాయి.
ఈ సందర్భంగా రాశి సీడ్స్ కాటన్ బిజినెస్ మార్కెటింగ్ హెడ్ సత్యనారాయణరావు హెచ్‌జీ మాట్లాడుతూ అశోక్ వంటి రైతుల సానుకూల అభిప్రాయాలను గుర్తించామన్నారు. రాశి మిత్రలో నమోదు చేసుకున్న రైతుల వ్యవసాయ నైపుణ్యాన్ని పెంపొందించడమే కాకుండా పర్యావరణ వ్యవస్థను సానుకూలంగా ప్రభావితం చేస్తున్నామని తెలిపారు. ఇది ఒక మంచి కోసం రైతులు తమ అభిప్రాయాలు పంచుకోవడానికి అవకాశం కల్పిస్తుందన్నారు. అశోక్ లాంటి రైతులను అంబాసిడర్‌లుగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ రాయబారులు విజయ గాథల ద్వారా తోటి రైతులతో అనుభవాలను పంచుకుంటారని తెలిపారు. ఈ విధానం స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తుందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఐక్యతను పెంపొందిస్తుందని చెప్పారు. రాశి మిత్ర రైతులకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. తెలంగాణాలోని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రైతు అశోక్ మాట్లాడుతూ పదేళ్ల రాశి మిత్ర మద్దతుతో ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించానని తెలిపారు. అనూహ్య దిగుబడులు సాధించానని పేర్కొన్నారు. అస్థిర వాతావరణ, శాశ్వత సవాళ్లతో ఎదురు నిలవడంతో ఈ విజయాలు సాధ్యమయ్యాయని చెప్పారు.
తెలంగాణాలోని తలమడుగుకు చెందిన ఎన్ పద్మాకర్ రెడ్డి మాట్లాడుతూ పంట దిగుబడి, లాభాలు అర్జించే రకాలకు ప్రాధాన్యత ఇచ్చానన్నారు. రాశి మిత్ర ఎంతగానో ఉపయోగపడిందని తెలిపారు. తెలంగాణాలోని వరంగల్‌లోని ఖాదర్‌పేటకు చెందిన కే అనిల్ కుమార్ మాట్లాడుతూ రాశి మిత్రతో ఉన్న అనుబంధం కేవలం టైటిల్‌గా కాకుండా గౌరవ బ్యాడ్జ్‌గా భావించానన్నారు. రాశితో మిత్రత్వం వ్యవసాయ పద్ధతులను ఉన్నతీకరించిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఖమ్మంలోని ముటాపురానికి చెందిన వీ అశోక్ కుమార్ మాట్లాడుతూ రాశి మిత్ర మార్గదర్శకత్వం ఖర్చులను గణనీయంగా తగ్గించిందన్నారు. మెరుగైన రాబడి సాధ్యమైందన్నారు.