చిన్న మొత్తాలపై స్వల్పంగా వడ్డీ రేట్ల పెంపు

హైదరాబాద్‌: చిన్న మొత్తాల పై వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచు తూ కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవ త్సరం జులై నుంచి సెప్టెంబర్‌తో ముగియనున్న త్రైమాసికానికి గాను చిన్న మొత్తాలపై వడ్డీ రేట్లను సవరించింది. ఐదేళ్ల రికరింగ్‌ డిపాజిట్ల (ఆర్‌డి)పై గరిష్టంగా 0.3 శాతం మేర పెంచింది. కాగా.. పిపిఎఫ్‌, సుకన్య సమృద్థి యోచన లాంటి కీలక పథకాలపై వడ్డీ రేట్లను పెంచకపోవడం గమనార్హం. పోస్టు ఆఫీసుల్లో అందించే ఐదేళ్ల రికరింగ్‌ డిపాజిట్‌పై వడ్డీ రేటు 6.2 శాతం నుంచి 6.5 శాతానికి పెరిగింది. ఏడాది కాలావధి కలిగిన టర్మ్‌ డిపాజిట్‌పై వడ్డీ రేటు 0.1 శాతం పెంచడంతో 6.9 శాతానికి చేరింది. రెండేళ్ల టర్మ్‌ డిపాజిట్‌పైనా 0.1 శాతం వడ్డీ పెంచారు. దీంతో వడ్డీ రేటు 7 శాతానికి పెరిగింది. మూడేళ్లు, ఐదేళ్ల కాలపరిమితి డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేట్లను మార్చలేదు. నేషనల్‌ సేవింగ్స్‌ స్కీమ్‌, కిసాన్‌ వికాస్‌ పత్ర, సుకన్య సమృద్థి తదితర ఇతర పథకాల వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.