చిరు వ్యాపారంతో ఎంతో లాభం

– ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు

నవతెలంగాణ-నెల్లికుదురు : చిరు వ్యాపారంతో ఎంతో లాభసాటిగా ఉంటుందని ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు  సర్పంచ్ బీరవెల్లి యాదగిరిరెడ్డి ఎంపిటిసి వెన్నకుల వాణి శ్రీనివాస్ బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పరుపాటి వెంకటరెడ్డి మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్లు అన్నారు మండల కేంద్రంలో శివ శంకర ఆటోమొబైల్ షాపును బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిరు వ్యాపారం ఎంతో మంచిదని దీంతో లాభసాటిగా ఉంటుందని అన్నారు ఈ ఆటోమొబైల్ షాప్ లో అన్ని రకాల వాహనాలకు సరిపడు పరికరములు అని అన్నారు ఇందులో నాణ్యమైన పరికరాలను సరసమైన ధరలకు అందించబడనని అన్నారు ఈ షాపును సద్వినియోగం చేసుకోవాలని కోరినట్లు తెలిపారు ఇందులో వాహనదారులకు అన్ని రకాల పరికరాలతో పాటు ఆయిల్ కూడా లభించును అని అన్నారు ఈ శివ శంకర ప్రోప్రైటర్ కసర బోయిన మంజుల విజయ్ యాదవ్ ఇంత మంచి వ్యాపారం ఎంచుకొని ముందుకు సాగుతున్నందుకు వీరిని అభినందించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పరుపాటి రుక్మిణి నాయకులు బాలాజీ నాయక్ ఎడ్ల మహేష్ కొమురయ్య యాకన్న కొమురెల్లి దేవేందర్ పులి రామచంద్రు. ఆదిరెడ్డి జిలకర యాలాద్రి బిర్రు యాకయ్య తదితరులు పాల్గొన్నారు