కంపు కొడుతున్న పెద్దవూర చౌరస్తా..

– రెండు జాతీయ రహదారులకు అనుసంధానంగా ఎక్స్ రోడ్డు
– పారిశుధ్యం పాటించని సమీప షాపులవాళ్ళు
– దుర్వాసనతో ఇబ్బంది పడుతున్న స్థానికులు
– పట్టించుకోని ప్రత్యేక అధికారులు
నవతెలంగాణ – పెద్దవూర
మండల పరిధిలోని పెద్దవూర నాగార్జున సాగర్ వెళ్లే చౌరస్తా పరిసరాలు కంపుకొడుతున్నాయి.  నిబంధనలకు విరుద్ధంగా షాపుల వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్నారు. గుంతల్లో వర్షపు నీటిలో చెత్త వ్యర్థలు చేరి కంపు కొడుతోంది. దీంతో ఆ ప్రాంతమంతా అపరిశుభ్రంగా మారి దుర్వాసన వెదజల్లుతోంది. హోటల్లు, తోపుడు బండ్లు, టీ – స్టాల్స్, షాపులు, భోజన హోటళ్ల వారంతా వ్యర్థలను వేస్తున్నారు. చౌరస్తా సమీపంలో సబ్ స్టేషన్ ఉంది. ఇక్కడికి కరెంటు విషయం లో రైతులు ప్రతినిత్యం ఎదో సమస్యల పై వస్తుంటారు. వారికీ సబ్ స్టేషన్ ముందు మురుగు, చెత్త దర్శనం ఇస్తుంది. జెడ్చెర్ల కోదాడ జాతీయ రహదారి, నగార్జున సాగర్ హైదరాబాద్ జాతీయ రహదారికి అనుసంధానంగా చౌరస్తా ఉంది. అంతే గాక అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా వున్న నాగార్జున సాగర్ కు పెద్దవూర చౌరస్తా నుంచే ప్రతి నిత్యం వందలాది వాహనాలు వెళుతుంటాయి, ఉమ్మడి రాష్ట్రల మంత్రులు,ఎంఎల్ ఏ లు, ఎంపీ లు, అధికారులు, అంతా ఇక్కడి నుంచి హైదరాబాద్ కు, సాగర్ కు వెళుతుంటారు. ఇంతటి ప్రాముఖ్యత వున్న పెద్దవూర చౌరస్తా చెత్త చెదారం తో దుర్వాసనకు ప్రాముక్యంగా మారింది. ఇంత చెత్త వున్న ఎవరు పట్టించు కోవడం లేదు. గ్రామాల్లో చెత్త కనపడితే చర్యలు తీసుకునేందుకు ముందుకు వచ్చే అధికారులకు పెద్దవూర చౌరస్తా సమీపంలోని  మురుగు నీరు, చెత్త చెదారం కనిపించడం లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అలాగే పాఠశాల కు, వ్యవసాయక్షేత్రాలకు వెళ్లేవారు మురుగునీటితో, చెత్త తో  దుర్వాసన వెదజల్లుతుండటంతో  విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కానీ నిత్యం దుర్వాసనతో సమీపంలోని ప్రజలు అవస్థలు పడుతున్నారు. అయినా పట్టించుకునే వారు లేరు.  పరిసరాలు పరిశుభ్రంగా లేవు. అధికారులు సైతం ఇక్కడ కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రత్యేక అధికారులు వెంటనే చెత్తను తోగించి అక్కడ చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని అక్కడి వారంతా కోరుతున్నారు.
పరిశుభ్రత పాటించక పొతే జరిమానాలు విధిస్తాం..
పెద్దవూర మండల కేంద్రం చౌరస్తా సమీపంలోని రోడ్లపై చెత్త పోశారని నా ద్రుష్టికి రాలేదు. పరిశుభ్రత పాటించకపోతే జరిమానాలు విధిస్తాం. వినకుంటే ప్రభుత్వ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటాం. రోడ్లపై చెత్త వేయకుండా  చర్యలు తీసుకోవాలి. లేదంటే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.