
– ఆదివాసిలందరూ హాజరు కావాలి
నవతెలంగాణ -తాడ్వాయి : వచ్చేనెల జనవరి 5వ తారీఖు శుక్రవారం రోజున మండల కేంద్రంలోని ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో తుడుం దెబ్బ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు నూతన తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు నిర్వహించనున్నట్లు అందరూ హాజరు కావాలని తుడుందెబ్బ మండల అధ్యక్షుడు గౌరబోయిన మోహన్ రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా గౌరబోయిన మోహన్ రావు మాట్లాడుతూ ఏజెన్సీలో ఆదివాసి చట్టాలు పగడ్బందీగా అమలు చేయాలన్నారు. మేడారం ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి గిరిజన జాతర అని ఆదివాసీలందరూ ఆదివాసి సంప్రదాయాల ప్రకారం జాతరకు సహకరించాలని తెలిపారు. మండల వ్యాప్తంగా ఉన్న ఆదివాసీ మేధావులు, ఆదివాసి విద్యార్థి సంఘాలు, ఆదివాసి మహిళా సంఘాలు ప్రతి ఆదివాసి తప్పకుండా హాజరుకావాలని తెలిపారు. నూతన తుడుం దెబ్బ మండల అధ్యక్షులు ఎన్నిక ఉంటుందని పేర్కొన్నారు.