సాంఘిక సంక్షేమ కళాశాలలో సాఫ్ట్ బాల్ స్లగ్గర్ అందజేత

నవతెలంగాణ- ఆర్మూర్:
పట్టణంలోని సాంఘిక సంక్షేమ కళాశాల‌   క్రీడా మైదానంలో కొనసాగుతున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ విద్యా సంస్థల సాఫ్ట్ బాల్ అకాడమీ క్రీడాకారులు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ పోటీలలో రాణిస్తున్న సందర్భంగా జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు వి ప్రభాకర్ రెడ్డి 50వేల రూపాయల విలువగల సాఫ్ట్ బాల్ స్లగ్గర్ ‌ను  కళాశాల ప్రిన్సిపల్ దుర్గ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో క్రీడాకారులకు అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ  అకాడమీ క్రీడాకారులు అకాడమీ కోచ్ నరేష్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పోటీలలో రాణించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో మరింతమంది క్రీడాకారులు భారత జట్టుకు ప్రాతినిధ్యం వాయించడాని కి కృషి చేయాలన్నారు.‌ క్రీడాకారులకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ దుర్గారెడ్డి, జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్, సాఫ్ట్ బాల్ అకాడమీ కోచ్ నరేష్, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు రాజేందర్‌‌, అర్జున్ క్రీడాకారులు పాల్గొన్నారు.