మూడవ పోలీస్ స్టేషన్ పరిధిలో కత్తిపోట్ల కలకలం

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మూడవ పోలీస్ స్టేషన్ పరిధిలో కత్తిపోట్ల సంఘటన సోమవారం కలకలం రేపింది. నగరంలోని మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే లైన్ ప్రాంతంలో డబ్బుల విషయంలో ఇద్దరికీ మధ్య జరిగిన ఘర్షణలో ఒకరిని కత్తితో దాడి చేయడంతో తీవ గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికుల ముందు కత్తిపోట్ల కలకలం జరగగా మూడవ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మూడో పోలీస్ స్టేషన్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని నిజామాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఉపాధి నిమిత్తం నగరానికి వలస వచ్చాడు. ఈ మేరకు మూడో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సమాచారం.