తెలంగాణ ఉద్యమకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

A special corporation should be formed for Telangana activists– తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దాసర్ల శ్రీశైలం..
తెలంగాణ ఉద్యమ కారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని పాదయాత్ర..
నవతెలంగాణ – జన్నారం
తెలంగాణ ఉద్యమకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాసర్ల శ్రీశైలం అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూ ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ ఓయూ ఆర్ట్స్ నిర్వహిస్తున్న పాదయాత్రలో భాగంగా, మండలంలోని కలమడుగు గ్రామానికి పాదయాత్ర చేరుకున్న సందర్భంగా వారికి మండల సీపీఐ(ఎం) పార్టీ నాయకులు స్వాగతం పలికారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ కల సాకారం చేసుకునేందుకు జరిగిన నాటి పోరాటంలో సకల జనుల పాత్ర మరువలేనిదన్నారు. ఉద్యమంలో ఎంతోమంది ప్రాణ త్యాగం చేశారన్నారు. అరెస్టులు, లాఠీ చార్జీలు, దాడులు, జైలు జీవితాలు అన్నింటిని ఎదిరించి కొట్లాడి ప్రత్యేక రాష్టం సాధించుకున్నామన్నారు. ఫలితంగా 10 సంవత్సరాల పాటు కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలించి ఉద్యమకారులకు మొండి చేయి చూపారన్నారు. అందరికీ న్యాయం చేస్తాడని నమ్ముకోవడం, ఉద్యమకారుల సహకారం వల్లనే రెండుసార్లు అధికారం చేపట్టగలిగింది కేసీఆర్ ప్రభుత్వం. కెసిఆర్ కుటుంబ పాలనలో  ఉద్యమకారులు గౌరవ, మర్యాదలకు గానీ కనీసం ఎలాంటి గుర్తింపుకు నోచుకోలేదన్నారు. ప్రశ్నించిన వారిని నిలదీసిన వారిని, నిర్బంధించి నిండా ముంచిన ఘనత  కెసిఆర్ కు దక్కిందన్నారు. ప్రత్యేక తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ కి మద్దతిస్తామని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని నమ్మించి మోసగించిన ఘనుడు కెసిఆర్ అన్నారు.
తెలంగాణ ఇస్తే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తమవుతున్నా తెలంగాణకోసం జరుగుతున్న విద్యార్థి, యువత ఆత్మ బలిదానాలకు చలించి సోనియా గాంధీ  నాడు తెలంగాణ రాష్ట్రాన్ని  ప్రకటించారన్నారన్నారు. ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పిస్తామని తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రకటించింధన్నారు.  ఇప్పటివరకు 11 నెలలు గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ పాదయాత్ర మొదలు పెట్టామన్నారు.  ఈ సందర్భంలో తెలంగాణలోని ఉద్యమకారులంతా ఒక్కతాటిపైకి వచ్చి హక్కుల సాధనకు పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ నేపథ్యంలోనే ఈ నెల 15 నుండి 29 వరకు ఆదిలాబాద్ నుండి ఆర్ట్స్ కళాశాల వరకు పాదయాత్ర చేపడుతున్నాము. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలోపే ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరిస్తే ఉద్యమకారులంతా కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయిలో మద్దతు తెలియజేస్తారని హామీ ఇస్తున్నాము. తాము చేస్తున్న న్యాయ బద్దమైన మా కార్యక్రమానికి అన్ని రంగాల కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు సహకరించాలని కోరుతున్నాం  అన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా హామీ ఇచ్చిన ఇంకా జాప్యం చేయకుండా మా హామీ నెరవేర్చాలని కోరుతున్నాం అన్నారు. జన్నారం మండలంలోని మురిమడుగు గ్రామంలో పాదయాత్ర నిర్వహిస్తుండగా మద్దతు తెలిపిన సీపీఐ(ఎం) పార్టీ నాయకులు కే బుచ్చయ్య కొండగుర్ల లింగన్న, అంబటి లక్ష్మణ్, ఎస్.కె అబ్దుల్లాకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. కార్యక్రమంలో ఉద్యమకారులు పాల్గొన్నారు.