రేపు గ్రామాలలో తాగునీటి సమస్యపై ప్రత్యేక సమావేశం

నవతెలంగాణ – రెంజల్

మండుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకొని గ్రామాలలో ఎలాంటి తాగునీటి సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీడీవో శంకర్, ఎంపీవో గౌస్ ఉద్దీన్ లు తెలిపారు. ఈనెల 6న మధ్యాహ్నము రెండు గంటలకు మండల ప్రత్యేక అధికారి, గ్రామాల లో ఉన్న ప్రత్యేక అధికారులు, గ్రామ కార్యదర్శులతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆయా గ్రామాల కార్యదర్శి పాల్గొని తమ గ్రామంలోని సమస్యలను గురించి వివరించి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకొని ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.