
మండలంలోని బస్వాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గ్రామ ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందించాలని, తరగతి గదులు ఉపాధ్యాయుల హాజరు పట్టిక పరిశీలించి సమయపాలన పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దయాకర్, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.