ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ప్రత్యేక అధికారి

నవతెలంగాణ – తొగుట
రైతులు పండించిన ధాన్యం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో అమ్ముకోవలని నీటి పారుదల శాఖ ఏఈ, రాంపూర్ ప్రత్యేక అధికారి కిరణ్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని రాంపూర్ వాగు గడ్డ వద్ద వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ రైతులు ఎంతో కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అమ్ముకోవలని సూచించా రు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో అమ్ముకొని మద్దతు ధర పొందాలన్నారు. ఈ కార్య క్రమంలో  పంచాయతీ కార్యదర్శి దివ్య, ఆర్ఐ అశోక్ రాజ్, గారు ,ఏఇవో రాజేష్, సీఈఓ గంగా రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.