నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని పిఫ్రీ సెక్టార్ పరిధిలోని చేపూర్ గ్రామ అంగన్వాడి సెంటర్లో గురువారం పలు కార్యక్రమాలు నిర్వహించినట్టు అంగన్వాడి సూపర్వైజర్ వెంకటరమణమ్మ తెలిపారు. 0 నుండి 5 సంవత్సరవలోపు పిల్లలకు బరువులు పరిశీలించడం, ఏడు నెలల నుండి మూడు సంవత్సరాల వరకు పిల్లలకు బాలామృతం పంపిణీ, చిన్నారుల తల్లులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు మండలంలోని 9 గ్రామాలలో అంగన్వాడి కేంద్రాలలో పై అధికారుల ఆదేశానుసారం చిన్నారులకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.