– ద్విచక్ర వాహనదారుడిపై బురద
నవతెలంగాణ-ముదిగొండ
కోదాడ డిపోకు చెందిన ఆర్టిసి బస్సు ఖమ్మం నుండి కోదాడ వైపు వేగంగా వెళ్లడంతో శుక్రవారం పారిశ్రామిక ప్రాంతంలో బస్సు సమీపాన ముదిగొండ నుండి ఖమ్మం వెళుతున్న ద్విచక్ర వాహనదారులపై బస్సు చక్రాల బురదపడటం బట్టలు బురదమయమయ్యాయి. దీంతో ముదిగొండకు చెందిన ద్విచక్ర వాహనదారుడు కందుకూరి రాకేష్ ఆర్టీసీ బస్సును ఆపి డ్రైవర్‌పై అగ్రహం వ్యక్తం చేశారు. ఒకపక్క వర్షం నీరు, రోడ్డుమీద చేరటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఉన్నదని, ఇరువైపులా వాహనాలను చూసి బస్సును నడపాలని డ్రైవర్‌కు చెప్పారు. దీంతో వివాదం సద్దుమణిగింది.