
నవతెలంగాణ – వేములవాడ రూరల్
ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ఉల్లాసంగా, ఉత్సాహంగా పాఠశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం లో మర్రిపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు. వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2011- 12 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం గురువారం ఘనంగా నిర్వహించారు. తమకు విద్యాబుద్ధులు చెప్పిన నాటి గురువులను పూర్వ విద్యార్థులు శాలువాలతో ప్రత్యేకంగా ఘనంగా సన్మానించారు. అనంతరం పూర్వ విద్యార్థులు అందరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. వివిధ వృత్తులలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు తమ గత స్మృతులను నెమరువేసుకుంటూ తాము చదువుకున్న పాఠశాలలో కలియ తిరిగి తమ అనుబంధాలను స్మరించుకున్నారు. తమ విద్య, వైవాహిక, ఉద్యోగ జీవిత విశేషాలు, కుటుంబ నేపథ్యాల విషయాల గురించి ఒకరికొకరు చెప్పుకుంటూ, సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటూ ఎంతో ఆనందోత్సాహాలతో గడిపారు. ఈ సమ్మేళనంలో ఉపాధ్యాయులు ప్రతాప్రెడ్డి,లచ్చిరెడ్డి ,ఉమామహేశ్వర్ ,అంజయ్య, స్వరూపరాణి,రమ,పూర్వ విద్యార్థులు గంగ స్వామి, వెంకటేష్, మహేష్, నరేష్, రజనీకాంత్, శ్యామల, సౌందర్య, హేమలత, దివ్య, వనిత ,స్వాతి ,మధు శ్రీ , శ్రీలేఖ, దీపిక ,మమత, తదితరులు ఉన్నారు.