పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

నవతెలంగాణ – ధర్మసాగర్
1980,1981. టెన్త్ క్లాస్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం మడికొండ మా ఫంక్షన్ హాల్ లో  విద్యను బోధించిన అధ్యాపకుల మధ్య ఘనంగా జరుపుకొన్నారు. ఈ కార్యక్రమం  వెంగళ సుధాకర్ ఆధ్వర్యంలో జరిగింది.ఈ కార్యక్రమానికి సుమారుగా విద్యార్థు నీ విద్యార్థులు 70 మంది పాల్గొన్నారు.అధ్యాపకులు వెంకటేశ్వర్లు , నాగభూషణం , జోగా రెడ్డి , ఎల్లయ్య కాకతీయ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ రిటైర్డ్, ఉమా మహేశ్వరం,  కొమురయ్య , బొందయ్య , పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాకతీయ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ రిటైర్డ్ ఎల్లయ్య , మాట్లాడుతూ 44 సంవత్సరముల విద్యార్థులు ఈరోజు మా స్థాయికి వచ్చి ఉన్నారు.అయినప్పటికిని మీకెంతో ఓపికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉందని  కొనియాడారు ఈరోజు చూసినట్లయితే మాతోపాటు ఎన్నెన్నో ఉద్యోగ రీత్యా మీరు అనుభవిస్తున్నారు. మీరు సుమారుగా 58, 60 సంవత్సరముల వాళ్లు ఉన్నారు మీరు మా అంతటి వాళ్లు అయ్యారు . మమ్ములను పిలిచి ఇంత ఘన సత్కార్యం చేయడం సంతోషంగా ఉందని అన్నారు.  ఇలాంటి రోజులు మరెన్నో రావాలని నేను ఆశిస్తున్నాను,నాగభూషణం సార్ మాట్లాడుతూ మీరు మొదటగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి పెద్దలు చెప్పేవారు  ఆరోగ్యమే మహా భాగ్యమని దానిని మించినది ఆస్తి ఇంకొకటి లేదు కాబట్టి మీరు ఒక స్టేజికి వచ్చారనీ,ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని హిత బోధ చేశారు.  విద్యార్థులు  విద్యార్థి దర్శను గుర్తు చేసుకుని అర్థవంతంగా పాట ల ద్వారా వారి ఉద్దేశాన్ని తెలియజేశారు .అనంతరం  మెమోంటో లు అధ్యాపకులచే పూర్వ విద్యార్థులు  అందుకోవడం జరిగింది. తదనంతరం గ్రూప్ ఫోటోతో మీటింగ్ పూర్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు 70 మంది పాల్గొన్నారు.