పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం..

నవతెలంగాణ – ఆళ్ళపల్లి
ఆళ్ళపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2005-2006 సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్ధులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా విద్యార్థులు పాఠాలు చెప్పిన నాటి గురువులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. పూర్వ సమ్మేళనం కార్యక్రమం గుర్తుగా ఆళ్ళపల్లి పాఠశాల ప్రాంగణంలో టీచర్లతో కలిసి పలు మొక్కలు నాటారు. సంవత్సరాల తరబడి పనుల్లో నిమగ్నమై ఆయా ప్రాంతాల్లో దూరంగా ఉన్న మిత్రులందరు ఒకచోట కలవడంతో ఒకరినొకరు బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి తరగతి గదుల్లో జ్ఞాపకాలను టీచర్లతో కలిసి గుర్తు చేసుకున్నారు. పూర్వ విద్యార్ధుల ఆతిథ్యాన్ని మన్నించి వచ్చిన టీచర్లతో కలిసి పంక్తి భోజనాలు చేశారు. తదనంతరం గెట్ టు గెదర్ కు వచ్చిన వీరభద్రం, చంద్రమోహన్, వీరన్న, సుజాత టీచర్లను విద్యార్థులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్ధులు ఆరిఫ్, సందీప్, శ్రీకాంత్, సాబీర్, కె.సతీష్, హరి, శ్రీధర్, సిద్దు, సతీష్, రాము, సింధు, స్రవంతి, శ్రావణి, ఎస్.సింధు, శ్వేత, సుజాత, సరిత, సంధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు.