
నవ తెలంగాణ-మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో 1989-90 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు ఆదివారం తాడిచెర్ల పాత హైస్కూలో గెట్టు గెదర్ పార్టీ నిర్వహించారు.అలనాటి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.34 సంవత్సరాల క్రితం విద్య బోధన, బుద్ది మాటలు నేర్పిన గురువులను పిలుపించుకొని వారికి శాలువాలు,పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అప్పటి గురువులు, పూర్వ విద్యార్థులు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మాట్లాడారు.అనంతరం ఆటపాటలతో ఎంజాయ్ చేశారు. ఈ కార్యక్రమంలో అప్పటి గురువులు,పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.