పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

– 1984-1985  బ్యాచ్..
– 39 సంవత్సరాల తర్వాత ఒకే చోట..
నవతెలంగాణ – వేములవాడ 
పాతజ్ఞాపకాలు.. తీపి గుర్తులు..  ఆనంద భాష్పాలతో.. 39 సంవత్సరాల తర్వాత ఒకే చోట.. వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ  ఉన్నత పాఠశాలలో1984-1985    పదవ తరగతి బ్యాచ్ కు పూర్వ విద్యార్థులు ఆదివారం  వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలో  ఓ ఫంక్షన్ హాల్లో  నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకున్నారు. పదవ తరగతి పూర్తి అయినా విద్యార్థులు,  తిరిగి ఒకే వేదికపై కలిశారు. వివిధ రంగాల్లో ఎక్కడెక్కడో స్థిరపడి సుధూర ప్రాంతాల నుంచి వచ్చిన అందరూ ఒకే చోట చేరడంతో వారి ఆనందానికి అవుదుల్లే కూడా పోయాయి. విద్యాబుద్ధులు నేర్పిన గురువు లను గుర్తు చేసుకున్నారు. అప్పుడు చేసిన అల్లర్లు నెమరు వేసుకున్నారు. చదువుకునే రోజుల్లో తరగతి గదిలో జరిగిన మధుర జ్ఞాపకాలను గురించి సరదాగా మాట్లాడుకున్నారు. అందరూ కలిసి తమ తమ సెల్ ఫోన్లలో  సెల్ఫీలు తీసుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు 39 సంవత్సరాల తరువాత తమను పిలించి ఇంతటి తీపి జ్ఞాపకాలను తిరిగి ఆస్వాదించేలా చేయడం, నిర్వహకులకు కృతజ్ఞతలు తెలిపారు.  అనంతరం పూర్వ విద్యార్థులు, ఒకరినొకరు  శాలువాలతో సన్మానించిన, చదువుకున్న రోజుల జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్  మన్నన్, గుట్టం బు ట్టం  దేవరాజ్, సిరిపురం శంకర్, ఉరడి  రామ్ రెడ్డి, దు రిశెట్టి రాము, కోటగిరి రాజశేఖర్, ఎండపల్లి  శ్రీనివాస్, నుగొప్పుల  శ్రీధర్ యాదవ్, ఆర్ పి రమణ, సగ్గు దేవి ప్రసాద్, కృష్ణారావు, రవి, గోయికర్  రాజు,  శ్రీనివాస్, దేవేందర్, దేవరాజ్,  పూర్వ విద్యార్థులు ఉన్నారు.