పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

– 30 ఏళ్ల తర్వాత కలిసిన స్నేహితులు
– మనకలలను మన పిల్లలతో సాధిద్దాం
నవతెలంగాణ-మర్పల్లి
30 ఏండ్ల తర్వాత మధుర జ్ఞాపకాలతో జిల్లా పరిషత్‌ మార్పల్లి పాఠశాల 1993-94 సంవత్సర 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మండల కేంద్రంలోని మార్కెట్‌ కార్యాలయ ఆవరణలో ఆదివారం శాలువా పూల మాలలతో ఉపాధ్యాయులను సత్కరించి మెమొటోలు అం దించి, పూర్వ విద్యార్థులను ఒకరినొకరు సత్కరించుకొని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ..1 నుండి 10వ తరగతి వరకు కలిసి చదువుకున్న పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకు న్నారు. కొందరు 10లోనే చదువులు మానేయడం, పెండ్లి లు జరగడంతో పై చదువులు చదువుకోలేకపోయామని మన కలలను మన పిల్లలను మంచి చదువులు చదివించి ప్రయోజకులను చేద్దాం అన్నారు. కొందరు ఉపాధ్యాయు లుగా, ఉద్యోగులుగా, ప్రయివేట్‌ ఉద్యోగులుగా స్థిరపడి జీవనం కొనసాగిస్తూ ఇలా కలుసుకోవడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. కలుసుకుంటామో లేదో అని అనుకోకుండా కలవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సమ్మేళనంలో 105 మంది విద్యార్థులకుగాను 85 మంది పాల్గొన్నారు. ఉపాధ్యాయులు జోసెఫ్‌, సర్దార్‌ మియా, విట్టల్‌, బక్కప్ప, సత్యనారాయణ, సమ్మేళనం ని ర్వాహకులు రాజు, అంజయ్య, టి చంద్రశేఖర్‌, ఏ. చంద్ర శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.
మన పిల్లలతో కలలను సాధించుకుందాం
మనం అవకాశాలు ఆర్థిక స్తోమత లేక పైచదు వులు చదువుకోలేకపో యాం. మనందరం మన పిల్లలను ఉన్నత చదువులు చదివించి మన కలలను నెరవేర్చుకుందాం.
చంద్రకళ, పూర్వవిద్యార్థురాలు.