పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 

A spirited gathering of alumniనవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండలంలోని ఉప్లూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన 2000-01 బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం  అపూర్వం అద్వితీయం అన్నట్లుగా అద్భుతంగా సాగింది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆద్యంతం కోలాహలంగా కొనసాగింది. చిన్ననాటి మిత్రులంతా ఒకచోట దశబ్ద కాలం తర్వాత కలుసుకోవడం పట్ల ఉప్పొంగిపోయారు. ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఒక్కచోటకు చేరి నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ బాల్య మిత్రులతో సరదాగా గడిపారు.నాటి ఆ పాత మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ ఆడి పాడారు. అనంతరం అందరూ కలిసి గ్రూప్ ఫోటోలు దిగి, ఆత్మీయంగా సామూహిక భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో సదాశివ్ గౌడ్, అవారి గంగారెడ్డి, అవారి మురళి, తదితరులు పాల్గొన్నారు.