పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

A spirited gathering of alumni

నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల పరిధిలోని కన్నాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1996- 97వ విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనం ఆదివారం మొలంగూర్ లోని వి ఎస్ ఆర్ గార్డెన్ లో నిర్వహించారు.ఈ సందర్భంగా ఉపాధి రీత్యా వివిధ రంగాలలో పట్టణాలలో నగరాలలో స్థిరపడిన పూర్వ విద్యార్థులంతా ఒక వేదికపై కలుసుకున్నారు.ఒకరినొకరు పరిచయం చేసుకొని తమ తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. మనం, టెన్త్ ఇంటర్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇలా ఎంతవరకు చదివినా గాని బాల్య దశ నుండి పదవ తరగతి వరకు చదువుకున్న,మధుర స్మృతిలే మదిలో మెదులుతాయని వేదికపై తెలిపారు. నాటి ఉపాధ్యాయులకు పుష్పగుచ్చాలు అందజేసి, శాలువాలు కప్పి, జ్ఞాపికలను అందజేసి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుద్దాల కుమార్, వీరేశం, హెడ్మాస్టర్ సురేందర్, రాజు, సమ్మయ్య, విజయలక్ష్మి విద్యార్థి విద్యార్థినులు అరుణ, సునీత, వాసవి, సువర్ణ, స్వరూప, బండ సతీష్, ఎన్ బుచ్చయ్య, మల్లేశం, మురళీకృష్ణ,ప్రమోద్ రెడ్డి, సంపత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.