మండల కేంద్రంలోని ఎస్ ఆర్ గార్డెన్ పాక్షన్ హల్ లో 1999- 2000 పదవ తరగతి విద్యార్థులు 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లి కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనాటి అధ్యాపకులకు ఆహ్వానించారు. బాల్యపు చిలిపి చేష్టలు, మధుర జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. కుటుంబ సభ్యులను ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. ఇలాంటి స్నేహ బంధం కలకాలం కొనసాగాలని కోరుకున్నారు. రెండున్నర దశాబ్దాల క్రితం విద్యావ్యవస్థలో ఉన్న పరిస్థితులు నేటి పరిస్థితులు పోల్చుతూ ఉపాధ్యాయులు సందేశం అందించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఏళ్ల క్రితం చదివిన వారంతా ఇప్పుడు సమ్మేళనం నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.