పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

A spirited gathering of alumni– మరపురాని జ్ఞాపకం పాలిటెక్నిక్ కళాశాల పాలిటెక్నిక్ కళాశాల సివిల్ ఇంజనీరింగ్
నవతెలంగాణ –  భువనగిరి
తాము ఉన్నత స్థానాలను అందుకోవడానికి తోడ్పడిన మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కళాశాల తమ జీవితంలో మరుపురాని జ్ఞాపకమని 1979 డిప్లమా సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు పేర్కొన్నారు. ఆదివారం  మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాలలో 1979 బ్యాచ్ డిప్లమా సివిల్ ఇంజనీరింగ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం  జనరల్ సెక్రెటరీ, వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసిన  కె అశోక్ కుమార్, ప్రముఖ కన్స్ట్రక్షన్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్  విజయ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. సుమారు 40 మంది నాటీ  విద్యార్థులు హాజరై మరోసారి స్వీయ పరిచయం  చేసుకున్నారు. కళాశాలతో తమకున్న అనుబంధాన్ని వారు చదువుకున్న రోజుల్లో తీపి జ్ఞాపకాలని నెమరు వేసుకున్నారు. కళాశాలలో నాటి అధ్యాపకుల బోధన క్రమశిక్షణతో తమ ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి వివిధ రంగాలలో రాణించడానికి సోపానాలయ్యాయని పేర్కొన్నారు. అధ్యాపకుల  రుణము తీర్చుకోలేమని పేర్కొన్నారు. త్వరలో నిర్వహించే డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ కోఆర్డినేటర్స్ గా ఎండి అక్రమ్, జి. చంద్రమౌళి, డి. ఉపేందర్ రెడ్డి, ఎన్. సత్యానంద్, ఎండి అబ్దుల్లా సమ్ సందన లనప ఎన్నుకున్నారు. జిపిటి మా ఫౌండర్ ప్రెసిడెంట్, అడ్వైజరీ బాడీ మెంబర్ ఆర్ సురేష్ ఆనంద్, ప్రధాన కార్యదర్శి   రమావత్ లాలు నాయక్,  కోఆర్డినేటర్స్ గా ఎన్నుకోబడిన పై సభ్యులను శాలువాతో, పుష్పగుచ్చాలతో సన్మానించారు.