పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

A spirited gathering of alumniనవతెలంగాణ – కంఠేశ్వర్ 

నగరంలోని పద్మ నగర్ కోటగల్లీ లోని వివేకానంద విద్యాలయం ఉన్నత పాఠశాలలో 1997-98 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని నగరంలోని ఏ యస్ ఆర్ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో స్థిర పడిన విద్యార్థులంతా సమావేశమై ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. తమకు విద్యా బోధన చేసినా గురువులు హాజరై తమ అమూల్యమైన సందేశాలను అందించారు. ఈ సందర్భంగా గురువులను పూలమాలలు, శాలువాతో సన్మానించారు. పూర్వ విద్యార్థులంతా చిన్ననాటి స్మృతులను గుర్తుచేసుకుంటూ రోజంతా సంతోషంగా గడిపారు.