పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

Alumni Associationనవతెలంగాణ – తొగుట 
2008 -2009 విద్య సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆదివారం మండలంలోని ఎల్లారెడ్డిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 2008 -2009 విద్య సంవత్సరం 10వ తరగతి విద్యను అభ్యసించిన విద్యార్థులు ఒకరికొకరు కుశల, యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. బోధిం చిన ఉపాధ్యాయులచే కలిసి రోజంతా ఉల్లాసంగా, సరదాగా గడిపారు. ఆట పాటలచే స్నేహితుల సాన్ని హిత్యాన్ని ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పూర్వ విద్యార్థుల్లో ఎన్ఫో ర్స్మెంట్ డిపార్ట్మెంట్లో ఎస్సైగా ఎంపికైన సాయి ప్రసాదును ఉపాధ్యాయులు అభినందించి శాలు వా తో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు తీగల సత్యనారాయణ గౌడ్, సోమ గారి నాగిరెడ్డి, పరపాటకంను అంజిరెడ్డి ,తాతిరెడ్డి హనుమారెడ్డి లను శాలువాతో సన్మానించి, మెమెంటోలు అందజేశారు.