పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

Alumni Associationనవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని పెద్దతూoడ్ల గ్రామంలో  ప్రభుత్వ జిల్లా పరిషత్ హైస్కూల్లో 2006-2007 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం పాఠశాలలో గెట్టుగెదర్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్నీ నిర్వహించారు.గత 18 సంవత్సరాల క్రితం తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ పాత అనుభవాలను, జ్ఞాపకాలను ఒక్కొరినొక్కరు నెమరు వేసుకున్నారు. అలనాటి గురువులైన పిలుపు సురేందర్, శ్రీనివాస్, తోట రాజు,కనుక రాజు,బిమయ్య,మాధవ్ లను శాలువాలు,పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు  పాల్గొన్నారు.