పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

నవతెలంగాణ-గంగాధర : గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలోని సురభి కాన్వెంట్ హై స్కూల్ లో 2007-08 సంవత్సరంలో విద్యాభ్యాసం చేసిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా జరుపుకున్నారు. పాఠశాల ఆవరణలో కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఎంతో  ఒకరినొకరు ఆలింగనం చేసుకుని అప్యాయంగా పలకరించుకున్నారు. చదువుకున్న సమయంలో చేసిన చిలిపి చేష్టలను, గురువులు బోధించిన విద్యా విధానాన్ని ఒకరినొకరు గుర్తు చేసుకుని సంతోషంగా గడిపారు. అనంతరం  బోధించిన గురువులకు ఘనంగా సన్మానం చేశారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో 84 మంది పాల్గొనగా, పాఠశాల కరస్పాండెంట్ చిప్ప వీరేశం, ప్రధానోపాధ్యాయుడు చిప్ప వీర నర్సయ్య, టీచర్లు దామోదర్, నాగరాజు, శ్రీనివాస్, ప్రేమ్ సాగర్, మల్లేశం, రాజేశం, రమేష్, గోపాల్ రెడ్డి, ఆనందం, ఆంజనేయులు, పూర్వ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.