మండలంలోని హాస కొత్తూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పాఠశాలలో 1998-1999 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు అందరూ ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. తమకు విద్య బుద్ధులు నేర్పిన ఆనాటి గురువులైన ప్రతాప్ రెడ్డి, రుక్మయ్య, లక్ష్మీ నరసయ్య లను పూర్వ విద్యార్థులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి, మెమొంటోలను అందజేశారు. ఈ సందర్భంగా చిన్ననాటి స్నేహితులు అందరూ కలిసి ఒకే వేదికపై చాలా సంవత్సరాల తర్వాత కలుసుకోవడం పట్ల ఆనందం వెలిబుచ్చారు. చిన్ననాటి స్నేహితుల యోగక్షేమాలను, వారి వారి వివరాలను ఒకరినొకరు అడిగి తెలుసుకున్నారు. అంతా కలిసి ఒక చోట చేరి ముచ్చటించుకున్నారు. అనంతరం గ్రూప్ ఫోటో దిగి, సహపంక్తి భోజనాలు చేశారు.