నవతెలంగాణ – బొమ్మలరామారం
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1993-94 పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం గురువారం మండలంలోని మర్యాల గ్రామంలో ఘనంగా జరుపుకున్నారు. తమకు విద్యాబుద్ధులు చెప్పిన నాటి గురువులను పూర్వ విద్యార్థులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం పూర్వ విద్యార్థులు అందరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. వివిధ వృత్తులలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు తమ గతస్మృతులన నెమరువేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జిట్టా యాదిరెడ్డి, నందేవ్,చంద్రమోహన్, మిత్రులు చంద్రమౌళి,మాధవరెడ్డి, రజినీకుమార్, మధుసూదన్,దామోదర్ రెడ్డి, దయాకర్ రెడ్డీ,పొట్ట ఇస్తరి, సంజీవ,శ్యామల,జయసుద,జ్యోతి,మిత్రులు పాల్గొన్నారు.