వీరవల్లి గ్రామంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలంలోని వీరవెల్లి గ్రామంలో ఆదివారం 2001 -2002 బ్యాచ్ కి చెందిన ఏడవ తరగతి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రధానోపాధ్యాయులు ఎం.డి గఫర్ , ఉపాధ్యాయులు సుధాకర్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి, సత్యనారాయణ హాజరై , మాట్లాడారు. చిన్ననాటితనంలో చేసిన అల్లరి చేష్టలను  నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు  సూర్వి రాజేష్, బాలరాజు,  నల్లమాస్ మహేష్,  తోటకూరి రవీందర్, సోకం రాజశేఖర్ ముదిరాజ్, బి వీరేష్,  బి శ్రీకాంత్, టి అలివేలు, టి స్వాతి హారిక అనిత మాధవి పలువురు పాల్గొన్నారు.