ఘనంగా శివరాంపల్లి ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
శివరాంపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 2007-2008 పదవ తరగతి చదివిన విద్యార్థినీ, విద్యా ర్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. పూర్వ విద్యార్థులు దాదాపు 16 సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నాడు పాఠశాలలో గడిపిన మధుర స్మృతు లను, జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుని సంతోషంగా గడిపారు. ఇక్కడ చదవిన విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి దేశ, విదేశాల్లో అత్యున్నత స్థానాల్లో స్థిరపడ్డా రు. నాడు తమకు విద్యాబుద్దులు నేర్పిన చదువు చెప్పిన గురువులను ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. ప్రస్తు తం వారు స్థిరపడ్డ రంగాలు, అనుభవాలను మిత్రులతో పంచుకున్నారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలుకరించు కొని ఆలింగనం చేసుకుని యోగ క్షేమాలు అడిగి తెలు సుకున్నారు. పూర్వ విద్యార్థులందరూ ఒకేచోట చేరవ డంతో సందడి నెలకొని ముఖాల్లో వెలుగులు నిండాయి. ఇక నుంచి టచ్‌లో ఉండాలంటూ ఫోన్‌ నంబర్లు తీసుకో వడంతో పాటు మధుర జ్ఞాపకాలను తమ సెల్‌ఫోన్లలో బంధించుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ గత 18 సంవత్సరాల క్రితం తాము పదో తరగతి వరకు ఈ పాఠశాలలో చదివామని అప్పటి మధుర స్మృతులు, తీపి సంఘటనలు గుర్తుకు వస్తున్నాయని, వాటిని నెమరు వేసుకొని ఆనందిస్తున్నామని ఆ కలవడం తమకు గర్వకారణంగా ఉందని, సంతప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం నిర్వహించడం తమకెంతో ఆనందాన్ని ఇచ్చిందని, ఇలా కలవడం మరపురానిదని వారు పేర్కొన్నారు. విద్యా బోధన చేసిన గురువులకు భక్తితో ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 16 సంవత్సరాల తర్వాత కలుసుకున్న వారంతా ఒకరికొకరు పలకరించుకొని వారి జీవన స్థితిగతులు పం చుకుని రోజంతా ఆనందంగా గడిపారు. అనంతరం ఆనాటి ఉపాధ్యాయులను పూర్వవిద్యార్థులు సన్మానించా రు. ఈ కార్యక్రమంలో విద్య కమిటీ చైర్మెన్‌ పడమటి శ్రీధర్‌రెడ్డి, జడ్పీహెచ్‌ఎస్‌ ప్రిన్సిపాల్‌ కిషన్‌నాయక్‌, ఉపా ధ్యాయులు నిరంజన్‌, అశోక్‌కుమార్‌, మల్లయ్య, నర్సిం హా చారి, ఇస్మైల్‌, కృష్ణమూర్తి, ప్రసన్న లక్ష్మి, లోహాలక్ష్మి, జయశ్రీ, తదితరులు పాల్గొన్నారు.