మాచారం గ్రామంతో ఆత్మీయ అనుబంధం

– వట్టె జానయ్య యాదవ్‌ ను ఆలింగణం చేసుకున్న గ్రామస్తులు
నవతెలంగాణ-పెన్‌పహాడ్‌
మండల పరిధిలోని మాచవరం గ్రామస్తులతో ఎన్నో ఏండ్లుగా ఆత్మీయ అనుబంధం ఉందని బహుజన సమాజ్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టె జానయ్య యాదవ్‌ అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని గ్రామం నుండి బుధవారం ఆయన ప్రారంభించారు. జానయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ 50 రోజులు అజ్ఞాతంలో ఉన్న తాను నియోజక వర్గ ప్రజలకు తనపై గల ప్రేమా, ఆప్యాయతా, అనురాగాలను గుర్తు చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కొనసాగుతున్న నిరంకుశ పాలనకు చరమగీతం పాడాల్సిన రోజులు దగ్గరపడ్డాయని, దానికి మీ అందరి సహకారం కావాలని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో గడీల పాలనకు బద్దలు కొట్టాలని బహుజన రాజ్యాన్ని స్థాపించడానికి సూర్యాపేట వేదిక కావాలని ఆత్మీయులతో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జానయ్యను గ్రామస్థులు ఆత్మీయ ఆలింగనం చేసుకుని తమ బిడ్డకు తాము అండగా నిలుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ లింగానాయక్‌, బొబ్బయ్య, ఆవుల అంజయ్య, వల్లాల సైదులు, కుంభం వెంకన్న, సైదులు, బొల్లక లింగయ్య, జానయ్య, కోటేష్‌, లింగరాజు, సతీష్‌, మాచారం గ్రామప్రజలు, ఆత్మీయులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.
నాగమ్మకు పరామర్శ
మండలంలోని చీదేళ్ల గ్రామానికి చెందిన పందుల నాగమ్మ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని వారిని పరామర్శించిన బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టె జానయ్య యాదవ్‌ ఆమెను పరామర్శించి, అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.