
యాదగిరిగుట్ట మండల ప్రజాపరిషత్ సోమవారం, ఎంపీపీ చీర శ్రీశైలం అధ్యక్షతన సర్పంచులకు ఆత్మీయ వేడుకలు సన్మానమును నిర్వహించారు. సర్పంచులు ఐదు సంవత్సరాలు పడిన కష్టాలు వారు వారి వారి గ్రామాలను అభివృద్ధి చేసిన తీరును వివరించారు. ప్రభుత్వం తరపున ఏ పథకం వచ్చినా అమలు చేసేది గ్రామస్థాయిలో మొదటిగా సర్పంచ్ అని, ప్రజల కష్టాలు తెలుసుకొని వారికి అవసరమగు మౌలిక వసతులను గ్రామస్థాయిలో కల్పించామని తెలిపారు. మౌలిక వసతుల సదుపాయాల కొరకు ప్రభుత్వంతో కొట్లాడి నిధులు తీసుకొచ్చి ఎన్నో రకాలుగా గ్రామ అభివృద్ధికి కృషి చేశామని సర్పంచులు భావోద్వేగంతో జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అనంతరం సర్పంచ్ లను శాలువాలతో సన్మానించి, షీల్డ్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి తోటకూరి అనురాధ బీరయ్య, ఎంపీడీవో ప్రభాకర్ రెడ్డి, ఎమ్మార్వో వెంకటేశ్వర్లు, ఎంపీఓ చంద్రశేఖర్, సర్పంచులు భీమగాని రాములు, తోటకూరి బీరయ్య, మొగిలిపాక తిరుమల రమేష్, తెల్జురి శ్రీశైలం, బీర్ల శంకర్, ఈదులకంటి భాస్కర్, నమిలే రాజ్యలక్ష్మి రామచందర్, సిరికొండ సత్యనారాయణ, భైరగాని చిన్న పుల్లయ్య, కానుగు కవిత బాలరాజ్, ఎంపిటిసిలు కర్రె విజయ వీరయ్య, కోఆప్షన్ సభ్యులు ఎండి యాకూబ్, ఎర్ర పోచయ్య, కాల్నె ఐలయ్య, ఎడ్ల సుగుణమ్మ రాంరెడ్డి, రేపాక మౌనిక, కొక్కలకొండ అరుణ తదితరులు పాల్గొన్నారు.