కన్హ శాంతివనంలో ఆధ్యాత్మిక మహోత్సవం

కన్హ శాంతివనంలో ఆధ్యాత్మిక మహోత్సవం– హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
నతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవ కార్యాక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ హార్ట్‌ ఫుల్‌నెస్‌ సహకారంతో రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా శాంతివనంలో నాలుగు రోజులపాటు ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవాలను నిర్వహించను న్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరై శాంతివనాన్ని సందర్శించారు. ఆధ్యాత్మికతపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ఆమె తిలకించారు. శాంతివనంలో మొక్కను నాటారు. కార్యక్రమానికి న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌, స్వామి చిదానంద సరస్వతి, చిన్న జీయార్‌ స్వామి, స్వామి ముకుందానంద, యోగి నిరంజన్‌ దాస్‌, నమ్రముని మహారాజ్‌, దాజి, దేవి చిత్ర లేఖ, తారాచంద్‌ కంటాలే, డాక్టర్‌ భవాని రావు, దిల్షాద్‌, టోనీ లాడర్‌, తదితరులు పాల్గొన్నారు.