పూర్వ చత్రోపధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం

A spiritual gathering of former teachersనవతెలంగాణ –  ఆర్మూర్ 
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి విజయలక్ష్మి గార్డెన్స్ లో శనివారం 1987- 88 సంవత్సరంలో జిల్లా డైట్ కళాశాలలో టిటిసి పూర్తి చేసిన బ్యాచ్ మిత్రులు ఒక కమిటీగా ఏర్పడి కన్వీనర్ గా పుష్పాకర్ రావు,కో కన్వీనర్స్ శ్రీనివాస్ రెడ్డి,సుజాత,ఇందిర,అశోక్, వినయ్ కుమార్ ల  ఆధ్వర్యంలో వివిధ స్థాయిలలో వివిధ రంగాలలో స్థిరపడిన క్లాస్మేట్స్ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా రిటైర్మెంట్ అయిన వారు కొందరు,విధి నిర్వహణలో కొనసాగుతున్నవారు  ఈ కార్యక్రమంలో 37 సంవత్సరాల తర్వాత కలిసిన అపూర్వ కలయిక ఆత్మీయతకు వేదిక అయింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కరణ్ మోహన్ రెడ్డి రిటైర్డ్ ప్రిన్సిపాల్,మల్లారెడ్డి రిటైర్డ్ లెక్చరర్,చంద్ర ప్రకాష్ రెడ్డి రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్,బి.ఆర్ జగదీశ్వర్ గౌడ్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్సై ఈటి హైదరాబాద్, శంకర్ రిటైర్డ్ క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ నిజామాబాద్ విశిష్ట అతిథులుగా అశోక్ డీఈవో ఆసిఫాబాద్,నాగలక్ష్మి అసిస్టెంట్ డైరెక్టర్ డీఈఓ ఆఫీస్ నిజామాబాద్ లు పాల్గొని,ఈ సందర్భంగా గురు దేవులు కరణ్ మోహన్ రెడ్డి,మల్లారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి లు మాట్లాడుతూ…అప్పటి గురుభక్తి, క్రమ శిక్షణ,వినయ విధేయతలు చాలా గొప్పవన్నారు.గురువులు పూర్వ ఛాత్రోపాధ్యాయులను  పరిచయం చేసుకొని,ఆనాటి జ్ఞాపకాలు గత స్మృతులను నెమరు వేసుకున్నారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.