– ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నల్లగొండ జిల్లా చైర్మన్ లకుమాల మధుబాబు
– మాలలంతా తరలిరావాలని పిలుపు
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
ఈనెల 23న మాల, మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనాన్ని జిల్లా కేంద్రంలోని ఎస్ఎల్బిసి రోడ్డులో గల జూలకంటి ఇంద్ర రెడ్డి ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్నట్లు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నల్గొండ జిల్లా చైర్మన్ లకుమల మధుబాబు తెలిపారు. నల్లగొండ పట్టణంలోని శాంతినగర్ లో గల మాల మహానాడు జిల్లా కార్యాలయంలో బుధవారం జిల్లా చైర్మన్ మధుబాబు అధ్యక్షతన జిల్లా కో చైర్మన్లు చింతపల్లి బాలకృష్ణ, అద్దంకి రవీందర్, సంద యాదగిరి, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా కన్వీనర్ రిటైర్డ్ ఎస్ఐ లింగం పిచ్చయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్నమల్ల అనిల్ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇంద్రారెడ్డి ఫంక్షన్ హాల్లో జరగబోయే మాల, మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి హాజరుకానున్నారని తెలిపారు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిరాష్ట్ర కమిటీ చైర్మన్ జి. చెన్నయ్య, కో చైర్మన్లు తాళ్లపల్లి రవి, మేక వెంకన్న, ఎర్రమళ్ళ రాములు, రాజు వస్తాద్, బూర్గుల వెంకటేశ్వర్లు, కర్ణం కిషన్, బేరా బాలకిషన్, మంచాల లింగస్వామి, చెరుకు రామచందర్, గోపోజ్ రమేష్ బాబు, వినోద్, మంత్రి నరసింహ, కనకరాజు, జంగ శ్రీను, గద్దె శ్రీను, నాను, నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ ఏకుల రాజారావు, మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం ఫౌండర్ చైర్మన్ నేతకానినరేష్, మాల ఉద్యోగుల సంఘం కన్వీనర్ అద్దంకి బుచ్చి రాములు, హాజరుకానున్నారని తెలిపారు. నవంబర్ లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మాలలంతా ఐక్యంగా ఉద్యమం చేస్తూ ప్రభుత్వాలకు, వర్గీకరణ మద్దతుదారులకు చెంపపెట్టుగా నల్లగొండ జిల్లాలో జరిగే మాల, మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం కు మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు, మాల ఉద్యోగస్తులు, కవులు, కళాకారులు, అధిక సంఖ్యలో పాల్గొని వర్గీకరణ వ్యతిరేకించి ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు చింతపల్లి లింగమయ్య, జిల్లా కమిటీ సభ్యులు భోగరి అనిల్, పురం వేణు, ఎంప్లాయిస్ కల్చరల్ సెక్రెటరీ ఈసం యాదగిరి, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నల్లగొండ నియోజకవర్గ కన్వీనర్ రొయ్య కిరణ్, నకిరేకల్ నియోజకవర్గ కన్వీనర్ ముడుసు బిక్షం, నల్లగొండ నియోజకవర్గ కో కన్వీనర్ అన్నిమల లింగస్వామి, గుర్రంపూడ్ మండల కన్వీనర్ ముసుకు పృథ్వి, నల్లగొండ పట్టణ కన్వీనర్ గండ మల్లవిగ్నేష్, కనగల్ మండల కో కన్వీనర్ నితీష్, తదితరులు పాల్గొన్నారు.