
గ్రామ మంచినీటి సహాయకులు స్టార్టర్ సమ్మర్సబుల్ పంపు పై అవగాహన కలిగి ఉండాలని మిషన్ భగీరథ డి ఈఈ గంగారాం మంగళవారం అన్నారు. జక్రాన్ పల్లి మండలం అర్గుల్ గ్రామంలో మిషన్ భగీరథ కార్యాలయంలో ఆర్మూర్ మండలంలోని అన్ని గ్రామపంచాయతీల గ్రామ మంచినీటి సహాయకులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ టెక్నికల్ పర్సన్స్ మాట్లాడుతూ.. మొదటగా గ్రామ నీటి సహాయకులు గ్రామంలో ప్రతి ఇంటికి నీరు అందించాలంటే మోటారు స్టార్టరు ఏ విధంగా నడుస్తుంది. ఆన్ ఆఫ్ ఏ విధంగా చేయాలి మోటర్ ఏ విధంగా సర్వీసిస్తుంది, అనే విషయాలపైన వివరించారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ డి ఈ గంగారం, ఆర్మూర్ ఎంపీడీవో సాయిరాం, మిషన్ భగీరథ ఏఈ లు మోహన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, చైన్ మెన్ లు రోడ్డ సాయన్న, మధు, మారుతి ,రంజిత్, రాజు ఆర్మూర్ మండలంలోని అన్ని గ్రామాల గ్రామ మంచినీటి సహాయకులు తదితరులు పాల్గొన్నారు.