అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ఎన్నికల సమయంలో విద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తామని చాలినన్ని నిధులు ఇచ్చి విద్యారంగంలో నైపుణ్యాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ బడ్జెట్ లో కేవలం మొత్తం విద్యారంగానికి 7.31శాతం నిధులు కేటాయించడం తీవ్ర నిరాశను కలిగించింది. అందులో ఉన్నత విద్యారంగానికి ఎన్నికల హామీలో విద్యారంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం గత కొంతకాలంగా మేధావులు,విద్యావేత్తలు, రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి 20%తగ్గకుండా నిధులు కేటాయించాలని పదే పదే కోరుతున్నప్పటికీ అట్టి విజ్ఞప్తిని పట్టించుకోలేదు. విద్యా రంగానికి తగినన్ని నిధులు కేటాయించకుండా విద్యాసంస్థల్లో నాణ్యమైన సమానమైన విద్య అందించడం సాధ్యం కాదు.
ఈ ప్రభుత్వం దశాబ్దాలుగా విద్యారంగానికి జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోకపోవడం ద్వారా పేదలకు,బలహీనవర్గాలకు ఉద్దేశ్యపూర్వకంగా అన్యాయం చేసినట్లే అవుతుంది. గత పాలకుల వలెనే ఈ ప్రభుత్వం కూడా విశ్వవిద్యాలయాల అభివృద్ధిలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరం- డాక్టర్ ఏ పున్నయ్య అధ్యక్షులు తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్..