నవతెలంగాణ – నెల్లికుదురు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో విద్యారంగానికి సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని టి పి టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సిద్ధోజు కవిత అన్నారు మండలంలోని ఆలేరు గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మధ్యాహ్న విరామ సమయంలో టి పి టి ఎఫ్ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగ పై మాటలేతప్ప చేతలు లేవన్నట్టుగా రాష్ట్ర బడ్జెట్ లో కేటాయింపులు గత ప్రభుత్వ విధానాన్నే కొనసాగించింది అని అన్నారు. 2,91,159 కోట్లలో 7.31 శాతం నిధులు దక్కాయి. గత సంవత్సరం 6.56 శాతం కేటాయిస్తే, ఇప్పుడు 21,292 కోట్లు కేటాయించడం, విశ్వ విద్యాలయాలకు గత ప్రభుత్వం ఇచ్చిన విధంగానే 500 కోట్లు కేటాయించడం చూస్తే విద్య పట్ల ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వ విధానాన్నే కొనసాగించనున్నదని తేటతెల్లమైంది. విద్యారంగంలో వినూత్న మార్పులు చేస్తామని ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్నారు. కాని అందుకు తగిన విధంగా బడ్జెట్ కేటాయింపులు చేయలేక గత ప్రభుత్వ బాటలోనే ప్రస్తుత ప్రభుత్వం కొనసాగుతుంది. నిధుల కేటాయింపు పెంచకపోవడంతో విద్యను ప్రవేటు రంగానికి వదిలివేసే కుట్రగా భావించాల్సి వస్తోంది. కాగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో విద్యకు 15 శాతం నిధులు అన్నారు అందులో సగం కూడా కేటాయించలేదు. ఈ అరకొర నిధులతో అందరికీ ప్రమాణాలతో కూడిన అందని ద్రాక్ష కానున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో జయప్రకాష్,హరీష్, నర్సయ్య, స్రవంతి, మహేష్, సునీత, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.