చోరీకి గురైన ట్రాక్టర్..

Stolen tractor– రికవరీ చేసిన ఎస్.ఐ శివరామ్ క్రిష్ణ..

నవతెలంగాణ – అశ్వారావుపేట
చోరీ కి గురైన ట్రాక్టర్ ను 24 గంటలు లోపే స్థానిక పోలీస్ లు రికవరీ చేసారు. బాధితుడు, ట్రాక్టర్ యజమాని అశ్వారావుపేట వడ్డెర బజారుకు చెందిన వెంకన్న బాబు తన స్వరాజ్ 735 ఎఫ్. ఈ నెంబర్ గల ట్రాక్టర్ ఇంజిన్ అపహరణకు గురి అయిందని శనివారం సాయంత్రం ఎస్.ఐ శివరామ్ క్రిష్ణ కు పిర్యాదు చేసాడు. ఎస్.ఐ తన సిబ్బందితో ఆదివారం ఉదయం తెలంగాణ – ఆంధ్ర సరిహద్దు ఆర్.టి.ఏ చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అశ్వారావుపేట కే చెందిన నాలుగు అనే వ్యక్తి ట్రాక్టర్ తో దొరికిపోయాడు. పంచనామా అనంతరం నాగు కోర్టు లో హాజరు పరిచినట్లు ఎస్.ఐ శివరామ్ క్రిష్ణ తెలిపారు.