మాజీ ప్రేయసి పై ప్రతీకారం తీర్చుకునే కథ

Ex-girlfriend Pi A story of revengeఅడివి శేష్‌ నటిస్తున్న పాన్‌-ఇండియా యాక్షన్‌ డ్రామా ‘డకాయిట్‌’. షానిల్‌ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సునీల్‌ నారంగ్‌ సహ నిర్మాత. హిందీ, తెలుగు భాషలలో ఏకకాలంలో ఈ చిత్రాన్ని చిత్రీకరణ చేస్తున్నారు. అడివి శేష్‌, షానీల్‌ డియో సంయుక్తంగా కథ, స్క్రీన్‌ ప్లే రూపొందించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి లాంగ్‌ షెడ్యూల్‌ మహారాష్ట్రలో కొనసాగుతుంది.
మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా అడివి శేష్‌, తన లీడింగ్‌ లేడీని ఈ హై ఆక్టేన్‌ ఫేస్‌ ఆఫ్‌లోకి స్వాగతిస్తున్నట్లు అనౌన్స్‌ చేశారు. మణాల్‌ ఠాకూర్‌ ఈ చిత్రంలో ఫీమేల్‌ లీడ్‌గా చేరారు. అడివి శేష్‌, మణాల్‌ ఠాకూర్‌ పాత్రల మధ్య కెమిస్ట్రీని ప్రజెంట్‌ చేస్తూ చిత్ర బృందం ఇంటెన్స్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. తనకు ద్రోహం చేసిన తన ఎక్స్‌ లవర్‌ పై ప్రతీకారం తీర్చుకునే కోపంతో ఉన్న దోషి కథగా, ప్రేమ, ద్రోహం, ప్రతీకారం, పవర్‌ ద్వారా నడిచే యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమా ఉండనుంది అని చిత్ర యూనిట్‌ తెలిపింది.