జివి ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ నటించిన ఫ్యామిలీ కామెడీ డ్రామా ‘డియర్’. ఈ చిత్రానికి ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. నట్మెగ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి పథ్వీరాజ్ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ఆంధ్రా ప్రాంతంలో విడుదల చేయనుండగా, ఏషియన్ సినిమాస్ తెలంగాణలో విడుదల చేయనుంది. ఈ చిత్రం తమిళంలో ఈనెల 11న, తెలుగులో ఈనెల 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. హీరో జివి ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ, ‘ఇది అందరూ రిలేట్ చేసుకునే సినిమా. మంచి ఎమోషన్స్ ఉంటాయి’ అని అన్నారు. ”డియర్ అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమా. ఇందులో నా పాత్ర నా మనసుకు ఎంతో దగ్గరైనది. దర్శకుడు చాలా అద్భుతంగా ఈ సినిమాని తీశారు. సినిమా చూసిన తర్వాత చిరునవ్వుతో బయటికివస్తారు ప్రేక్షకులు’ అని హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ చెప్పారు. చిత్ర దర్శకుడు ఆనంద్ రవిచంద్రన్ మాట్లాడుతూ, ‘గురక పెట్టడం ప్రతి ఇంట్లో సమస్య. ఈ దీనిపై కథ రాయడం చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. ఇదొక ఫన్ ఫ్యామిలీ డ్రామా. అందరూ రిలేట్ చేసుకుంటారు’ అని అన్నారు.