గౌతం కష్ణ హీరోగా, శ్వేత అవాస్తి, రమ్య పసుపులేటి కథానాయికలుగా సెవెన్‌హిల్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 3గా ఓ చిత్రం రూపొందుతోంది. పి.నవీన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇప్పటికే మూడు షెడ్యూళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, ‘స్టూడెంట్ నుంచి కార్పొరేట్ స్థాయికి ఎదిగిన మధ్య తరగతి కుర్రాడి కథ ఇది. యూత్‌కి, ఫ్యామిలీ ఆడియన్స్‌కి, అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం అలరిస్తుంది. త్వరలో టైటిల్‌ను ప్రకటిస్తాం. హీరో గౌతం కష్ణ ‘ఆకాశవీధుల్లో’ చిత్రంతో మంచి గుర్తింపు పొందారు. ఈ చిత్రంలో స్టూడెంట్ పాత్రకు వంద శాతం న్యాయం చేశారు’ అని అన్నారు. ‘విజయవంతంగా మూడు షెడ్యూళ్లు పూర్తి చేశాం. త్వరలో టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను విడుదల చేస్తాం’ అని నిర్మాత చెప్పారు. పోసాని కష్ణమురళి, అనితా చౌదరి, షఫీ, ఆర్కే మామ, ఆనంద్ చక్రపాణి, భద్రం, పింగ్ పాంగ్ సూర్య తదితరులు ఇందులో ఇతర ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు.