అమ్మ ప్రేమ లాంటి ఊరి కథ

A story of a village like mother's loveతన తొలి మూవీ ‘మేం ఫేమస్‌’తో లీడ్‌ యాక్టర్‌, దర్శకుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సుమంత్‌ ప్రభాస్‌ హీరోగా తన రెండో మూవీని అనౌన్స్‌ చేశారు. ఈ కొత్త మూవీ రెడ్‌ పప్పెట్‌ ప్రొడక్షన్స్‌ మేడిన్‌ వెంచర్‌. ఎం ఆర్‌ ప్రొడక్షన్స్‌ షార్ట్‌ ఫిల్మ్‌లతో పాపులరైన సుభాష్‌ చంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రామానాయుడు స్టూడియోస్‌ లో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తం షాట్‌కు హీరో శ్రీవిష్ణు క్లాప్‌ కొట్టారు. సురేష్‌బాబు కెమెరా స్విచాన్‌ చేశారు. దర్శకులు శ్రీకాంత్‌ ఓదెల, శౌర్యువ్‌, మహేష్‌ బాబు పి తొలి షాట్‌కి దర్శకత్వం వహించారు. స్క్రిప్ట్‌ని అల్లు అరవింద్‌ మేకర్స్‌కి అందజేశారు. నిధి ప్రదీప్‌ హీరోయిన్‌ గా పరిచయం అవుతోంది. జగపతి బాబు మేజర్‌ రోల్‌ పోషిస్తున్నారు.
హీరో సుమంత్‌ ప్రభాస్‌ మాట్లాడుతూ, ‘నేను చేసిన ఫస్ట్‌ సినిమా ‘మేం ఫేమస్‌’ నీ అందరూ చాలా గొప్పగా ఆదరించారు. నెక్స్ట్‌ ఎలాంటి ప్రాజెక్ట్‌ చేయాలని ఏడాదిన్నరగా అలోచించాను.చాలా కథలు విన్నాను.అలాంటి సమయంలో ఈ సినిమా రైటర్‌, డైరెక్టర్‌ సుభాష్‌ చంద్ర ఈ కథ చెప్పారు. ప్యూర్‌ ఆంధ్ర, భీమవరం వైబ్‌ లో అద్భుతంగా వుంది. అభినవ్‌ చాలా ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్‌. చాలా మంచి కథ తీసుకోచ్చారు’ అని అన్నారు.
హీరోయిన్‌ నిధి ప్రదీప్‌ మాట్లాడుతూ, ‘ ఈ ప్రాజెక్ట్‌ లో పార్ట్‌ అవ్వడం చాలా ఆనందంగా ఉంది.చాలా మంచి స్క్రిప్ట్‌ ఇది. ఈ సినిమాతో హీరోయిన్‌ గా పరిచయం కావడం చాలా హ్యాపీగా ఉంది’ అని తెలిపారు.
డైరెక్టర్‌ సుభాష్‌ చంద్ర మాట్లాడుతూ,’ఇది అమ్మ ప్రేమ లాంటి ఒక చక్కటి ఊరు కథ. గోదారి గట్టున కూర్చొని ఫ్రెండ్స్‌ తో కబుర్లు చెప్పుకుంటే ఎలా ఉంటుందో ఈ సినిమా అంత హాయిగా ఉంటుంది. ఇందులో రెండు ప్రేమ కథలు ఉన్నాయి. సుమంత్‌, హీరోయిన్‌ ది ఒక లవ్‌ స్టోరీ అయితే, తండ్రీకూతుర్లది ఒక లవ్‌ స్టోరీ’ అని చెప్పారు